శివరాత్రికి స్పెషల్ బస్సులు

Special-buses-shivaratriమహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ. జూబ్లీ బస్టాండ్ నుంచి కీసరగుట్టకు, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 60 మంది ప్రయాణికులు కలిసి వెళ్లాలనుకుంటే…వారికి ప్రత్యేక బస్సులను కూడా కేటాయించనుంది

కీసరగుట్టకు 274 స్పెషల్ బస్సులను కేటాయించారు. ఈ బస్సులు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 23 వ తేదీ నుంచి రెజిమెంటల్ బజార్, తార్నాక, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, అప్జల్ గంజ్, బాలానగర్, అమ్ముగూడ నుంచి 34 బస్సులు నడుపుతున్నారు. 24 న వెంకటాపురం, ఆదర్శపల్లి, కొంపల్లి, సుచిత్ర, ఉప్పల్, ఘట్ కేసర్, దిల్ సుఖ్ నగర్, మేడ్చల్  ప్రాంతాల నుంచి మరో 104 బస్సులు నడుపనున్నారు.

ఇవే ప్రాంతాలనుంచి 25 న 104 బస్సులు నడపనున్నారు. 26న రెజిమెంటల్ బజార్, తార్నాక, ఈసిఐఎల్ ఎక్స్ రోడ్, బాలాజీనగర్, అమ్ముగూడ ప్రాంతాల నుంచి 24 బస్సులను నడుపుతారు. తిమ్మనపల్లి తుర్కపల్లి, లక్ష్మాపూర్, హాజిపూర్, జియాపల్లి మీదుగా కీసరగుట్టకు 8 ప్రత్యేక బస్సులు మూడు రోజులపాటు నడపనున్నారు.

సికింద్రాబాద్ –కీసరగుట్టకు 35 రూపాయలు చార్జ్ వసూలు చేయనున్నారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్-కీసరగుట్టకు 26 రూపాయలు చార్జ్ గా నిర్ణయించారు. అమ్ముగూడ-కీసరగుట్టకు 30 రూపాయలు. వెంకటాపూర్ –కీసరగుట్టకు 37 రూపాయలు…  కీసర నుంచి కీసరగుట్టకు 13రూపాయలు వసూలు చేయనున్నారు.  రామాంతపూర్ –కీసరగుట్టకు 37రూపాయలు.  ఉప్పల్ –కీసరగుట్టకు 35రూపాయలుగా నిర్ణయించారు. ఘట్ కేసర్- కీసరగుట్టకు 24 రూపాయలు….  దిల్ సుక్ నగర్ – కీసరగుట్టకు 42రూపాయలు.  తార్నాక –కీసరగుట్టకు 32రూపాయల చార్జ్ తీసుకోనున్నారు.

ఇక MGBS నుంచి శ్రీశైలానికి ….ఎక్స్ ప్రెస్ చార్జీలు 239 రూపాయలు. డీలక్స్ 269 రూపాయలు. సూపర్ లగ్జరీ 322 రూపాయల చార్జ్ తీసుకోనున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy