శివైక్యం అంటే ఇదేనేమో.. : శివ లింగంపైనే పూజారి చివరి శ్వాస

prestకత్తి పట్టినోడు.. ఆ కత్తికే బలైనట్లు.. నిత్యం దైవ స్మరణలో ఉండే పూజారి.. ఆ దేవుడి సన్నిధానంలోనే.. దేవుడి పాదాల చెంతనే తుది శ్వాస విడవటం దైవ సంకల్పం కాకపోతే ఏంటీ.. ఇలాంటి ఘటనే ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. భీమేశ్వరంలోని పంచారామాల్లో ఒకటైన.. సోమేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు గుండెపోటుతో చనిపోయారు. ఆయన సోమేశ్వరాలయంలో పూజ చేస్తూనే శివలింగంపై కుప్పకూలారు. నిత్యం పూజించే శివుని ముందే శివైక్యం పొందారు. ఆయన గర్భగుడిలో శివలింగంపై పడి ప్రాణాలొదిలిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రధాన అర్చకులకు గతంలోనూ ఓ అరుదైన ఘటన జరిగింది. 1986లో రాజమండ్రికి వచ్చిన వరదల సమయంలో ఆయన ర్యాలీ క్షేత్రంలో పూజారిగా ఉన్నారు. గోదావరికి వరదలు వచ్చాయి.ఆ సమయంలో గట్టున ఉన్న అమ్మవారి గుడిలో ఉన్నారు. వరదలకు భయపడి అందరూ ముందుగానే వెళ్లిపోయారు. అయితే దుర్గమ్మకు హారతి, నైవేధ్యం పెట్టే సమయం అయ్యిందని.. అమ్మవారికి తీర్థప్రసాదం ఇచ్చే వస్తానని చెప్పి గుడిలోనే ఉండిపోయారు. ఈలోపే గోదావరి ఉప్పొంగింది. గుడి మొత్తం నీళ్లలో మునిగింది. అమ్మవారి విగ్రహం కొట్టుకుపోయింది. అమ్మవారినే పట్టుకుని ఉన్న పూజారి.. వరదల్లో కొట్టుకుపోతూ ఓ చెట్టు దగ్గర ఆగిపోయారు. అలాగే రెండు రోజులు ఉన్నారు. ఆ తర్వాత సహాయ సిబ్బంది ఆయన్ను కాపాడారు. అంతా ఈశ్వరుడి లీల అని చెబుతారు. అంతలా స్వామి సేవలో తరించారు కాబట్టే.. తన చివరి శ్వాస కూడా శివ లింగంపైనే విడవటం జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy