శుభవార్త : 48 గంటల్లో రాష్ట్రానికి నైరుతి

NAIRUTIతొలకరి పులకరింత కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రానికి నైరుతి ఒకరోజు ఆలస్యంగా పలకరించనుంది. కేరళలో మూడు రోజుల ముందుగానే ప్రవేశించినా.. రాష్ట్రానికి మాత్రం మరో 48 గంటల తర్వాతే రుతుపవనాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి వ్యాపించిందని, తెలంగాణలో జూన్‌ 6న అడుగుపెట్టనున్నాయని చెప్పింది. మంగళవారం(జూన్-5) రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నల్లగొండల్లో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదైంది. రుతుపవనాలు రాకతో.. ఈసారి మంచి వర్షాలు పడనున్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని.. పగటి టెంపరేచర్స్ కూడా తగ్గనున్నట్లు తెలిపారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy