శైలజా రెడ్డి అల్లుడు.. రివ్యూ


రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు

నటీనటులు: నాగచైతన్య,అనూ ఇమాన్యూయల్,రమ్యకృష్ణ,మురళీ శర్మ,నరేష్,వెన్నెల కిషోర్,పృథ్వీ తదితరులు

సినిమాటోగ్రఫీ: నిజర్ షఫీ

మ్యూజిక్ : గోపి సుందర్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాతలు: నాగ వంశీ,పి.డి.పి ప్రసాద్

రచన,దర్శకత్వం: మారుతి

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13,2018

కథేంటి:

చైతూ మొదటి చూపులోనే అను ని ఇష్టపడతాడు..కానీ ఆమెకు ఈగో ఎక్కువ.అసలే తన తండ్రి (మురళీ శర్మ) ఈగో తో సతమతమవుతున్న చైతుకి ఈ అమ్మాయి చూపించే పొగరు నచ్చదు. అందుకే తనను కన్వీన్స్ చేసి పెళ్లికి ఒప్పిస్తాడు..కానీ తన తండ్రి వల్ల అను వాళ్ల అమ్మ శైలజారెడ్డికి (రమ్యకృష్ణ) తెలియకుండా ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సివస్తుంది. అది ఇష్టం లేని అను ని వాళ్ల బంధువులు ఊరికి తీసుకెళ్లిపోతారు.వాళ్ల అమ్మ కు ఈగో మరీ ఎక్కువ. వాళ్ల ఈగోలందరినీ సాటిస్ ఫై చేసి ఆమెను ఎలా గెలుచుకున్నాడన్నదే మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

నాగ చైతన్య చూడటానికి హాండ్సమ్ గా ఉన్నాడు. మంచి నటన కనబరిచాడు.అనూ ఇమాన్యూయల్ గ్లామరస్ గా ఉంది.నటన పరంగా యావరేజ్.శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ మెప్పించింది కానీ తనను ఇంకా పవర్ ఫుల్ గా వాడుకోలేకపోయారు.మరళీ శర్మ తన పాత్రకు న్యాయం చేశాడు.వెన్నెల కిషోర్,పృథ్వీలు అక్కడక్కడా నవ్వించారు.నరేష్,దాసరి అరుణ్ కుమార్ పాత్రలకు సరైన ఇంపార్టెన్స్ లేదు.

టెక్నికల్ వర్క్:

నిజర్ షఫీ ఫొటోగ్రఫీ చాలా బాగుంది.గోపిసుందర్ ఇచ్చిన పాటల్లో మూడు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది.ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండాల్సింది.సెకండాఫ్ లో లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చుపెట్టారు.

విశ్లేషణ:

‘‘శైలజా రెడ్డి అల్లుడు’’ రెగ్యూలర్ కమర్షియల్ ఫిలిం.. తండ్రి,లవర్,అత్తల ఈగోల వల్ల నలిగిపోయే పాత్ర హీరోది.రొటీన్ అత్తా అళ్లుల్ల మధ్య సాగే ఫైటింగ్ లా కాకుండా కాస్త వేరేలా సెట్ చేశాడు డైరెక్టర్ మారుతి.అయితే ఈ పాయింట్ లో కూడా సరైన బలం లేకపోవడంతో ఈ అల్లుడు తేలిపోయాడు.తల్లీ కూతుళ్ల కాన్ ఫ్లిక్ట్ ఫోర్స్ డ్ గా ఉండటం వల్ల సెకండాఫ్ వీక్ గా మారింది.ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. ప్రీ ఇంటర్వెల్ ఘట్టాల తో సెకండాఫ్ మీద హోప్స్ పెరుగుతాయి.కానీ సెకండాఫ్ మొదలయ్యాక సినిమా రొటీన్ టర్న్ తీసుకుంటుంది.ముంగింపేంటో ఊహించేసేలా ఉన్న ఈ కథలో మారుతి ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు..రెగ్యులర్ గా తన సినిమాల్లో కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్ టైన్ చేసే మారుతి ఈ సినిమాలో మాత్రం విఫలమయ్యాడు.వెన్నెల కిషోర్,పృథ్వీ లాంటి కమెడియన్లున్నా కానీ.. నవ్వించిన సందర్భాలు చాలా తక్కువ.ఇక రమ్యకృష్ణను కూడా పవర్ ఫుల్ గా చూపించలేదు.తన మీద రాసుకున్న ఎలివేషన్ సీన్లు ఏవీ పండలేదు.తద్వారా సినిమా మొత్తం ఫ్లాట్ గా సాగిపోతుంది.టైమ్ పాస్ వరకు అయితే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది కానీ..పూర్తిగా మాత్రం ఆకట్టుకోదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy