శోభాయాత్ర: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

sri ramనగరంలో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్రలో భాగంగా పెద్దర్యాలీ తీసేందుకు రామభక్తులు రెడీ అయ్యారు. నాంపల్లి దగ్గర్లోని సీతారాంబాగ్ నుంచి కోఠీలోని  హనుమాన్ టెక్డీ  వ్యాయామశాల దాకా ర్యాలీ ఉంటుంది. ద్రౌపది గార్డెన్స్ నుంచి మొదలయ్యే శోభాయాత్రకు లక్ష మంది రామ భక్తులు హాజరవుతారని శ్రీరామనవమి ఉత్సవ సమితి వారు చెప్పారు.

నగరంలో ఏటా రెండు శోభాయాత్రలు జరుగుతాయి. ఒకటి సీతారాంబాగ్  నుంచి మొదలైతే మరోటి ధూల్ పేట్ లోని గంగాబౌలి రాణి అవంతిబాయినగర్ కమ్యూనిటీ హాల్ నించి ప్రారంభమవుతుంది. రెండు యాత్రలు మంగళ్ హాట్ దగ్గర కలుస్తాయి. ఇక యాత్ర కోసం ఇప్పటికే శివాజీ రథం, సీతారామలక్ష్మణుల రథాలు, గోమాత విగ్రహాలను సిద్ధం చేశారు. యాత్రలో VHP జాతీయ కార్యదర్శి  ప్రవీణ్ తొగాడియా పాల్గొంటారని ఉత్సవ సమితి వారు చెప్పారు.

శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర  ప్రారంభం అవుతుంది. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి చౌరస్తా, కమల్ కాన్ దేవ్డి, క్లాసిక్ చౌరస్తా, సిద్ధ్దంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్డీ హనుమాన్ వ్యాయామశాల దాకా శోభయాత్ర జరగతుంది. ధూల్ పేటలోని రాణి అవంతిబాయి భవన్ నుంచి మరో శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. మంగళ్ హాట్ నుంచి జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, గౌలిగూడ మీదుగా చివరకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది.

శోభాయాత్రకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేసింది. సీసీ కెమెరాలతో కనిపెడుతూనే 12 వేల పోలీసులతో గస్తీ ఉంటుందన్నారు. మరోవైపు శోభాయాత్ర సాగే రూట్లల్లో రేపు  కొన్ని దారులు బంద్ ఉంటాయన్నారు. అక్కడి నుంచి వచ్చే వాహనాలను ఇతర రూట్లలో డైవర్ట్ చేస్తామని తెలిపారు. శోభాయాత్రకు బల్దియా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేశామని చెప్పారునిర్వాహకులు. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమయ్యే శోభాయాత్ర..రాత్రి 7గంటలకి ప్రవీణ్ తొగాడియా స్పీచ్ తో పూర్తవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy