శ్రీదేవి డెత్ పై పిటీషన్ : ఒమన్ లో రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ ఉందంట

SRDFఅతిలోకసుందరి శ్రీదేవి మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ బాలీవుడ్ డైరక్టర్ సునీల్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం (మే-11) సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో గతంలో దాఖలైన అనేక పిటిషన్లను కొట్టేశామని, ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సృష్టం చేశారు. మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి-24న హోటల్ రూమ్ లోని బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే.

శ్రీదేవి 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉండేదని.. అయితే శ్రీదేవి పడి చనిపోయిన బాత్ టబ్ కేవలం 5 అడుగుల పొడవు మాత్రమే ఉందన్నారు. దీనిపై అనుమానాలున్నాయంటా సునీల్ సింగ్ ఆ పిటీషన్ లో తెలిపాడు. సునీల్ సింగ్ లాయర్.. సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ మరో సంచలన విషయాన్ని కూడా ప్రస్తావించారు. శ్రీదేవి పేరుపై ఒమన్ దేశంలో రూ.240 కోట్ల విలువైన ఇన్స్యూరెన్స్ పాలసీ ఉందన్నారు. అయితే ఆమె UAEలో చనిపోతేనే ఆ మనీ (ఇన్సూరెన్స్) రిలీజ్ అవుతుందని కోర్టులో వాదించాడు. ఒమన్ దేశంలోనే చనిపోతే చెల్లుబాటు అయ్యే విధంగా రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ ఉండటం.. శ్రీదేవి అక్కడే ప్రమాదవశాత్తు చనిపోవటంపై అనుమానాలు ఉన్నాయని వాదించాడు లాయర్ వికాస్ సింగ్. ఈ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

అపస్మారక స్ధితిలో బాత్ టబ్ లో పడి శ్రీదేవి చనిపోయినట్లు పోస్టుమార్టం తర్వాత దుబాయ్ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy