శ్రీనగర్ లో ఉగ్రదాడి.. జవాన్ మృతి

DDFwA1eUAAEgltWజమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాను అమరుడు అవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. శ్రీనగర్‌ పంథా చౌక్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై పహారా కాస్తున్న 29వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై దాడి చేశారు. ఏకే-47 రైఫిళ్లతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను సమీపంలోని బాదమిబాఘ్‌ సైనిక ఆస్పత్రికి తరలించగా.. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాహబ్‌ శుక్లా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రవాద దాడితో అలర్ట్‌ అయిన పోలీసులు, పారా మిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని ముష్కరులను ఏరివేసే ఆపరేషన్‌ను చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy