శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో.. 13వేల ఎకరాలకు సాగు నీరు

tummala20171210తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఆదివారం(డిసెంబర్-10) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ శివారు రాకాశితండ వద్ద ఆకేరుపై రూ.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం కం బ్రిడ్జీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడినప్పుడే వెనకబడిన గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యంగా జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలను కలిపే లింకు రోడ్లను పూర్తిచేస్తామన్నారు.

వచ్చే ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లనీరు ఇస్తామని తెలిపారు. ఈ నెల 16 తేదీన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం రెండో దశను ప్రారంభించి 13వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వివరించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ విజప్తి మేరకు పాలేరు, డోర్నకల్ నియోజకవర్గాల గ్రామాలను కలిపే లింకు రోడ్ల అన్నింటినీ తప్పకుండా మంజూరీ చేస్తానని హామీ యిచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy