శ్రీరామనవమికి అదనపు బస్సులు

TSRTC-Busశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం పుణ్యక్షేత్రానికి అదనపు బస్సులు నడుపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. తెలంగాణ, ఏపీలోని పలు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు. ఈనెల 4న 150 బస్సులు, 5న 330 బస్సులు, 6న 100 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు నడిచేలా ఏర్పాటు చేశారు. దూరప్రాంత బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించామన్నారు అధికారులు.

ఏప్రిల్‌ 5న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లుపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,  ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకలకు 2లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశముందని… అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy