శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ : ఈ జీవితం ఇక చాలు

srireddy-commentsసినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కొన్ని గంటల ముందు.. వరసగా చేసిన ఆ రెండు కామెంట్స్ పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మొదటిసారి నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నాను.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఈ జీవితం ఇక చాలు అంటూ మరో కామెంట్ చేసింది. ఈ రెండు కామెంట్స్ ఆమె తన సొంత ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేయటం సంచలనం అయ్యింది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ఉద్యమం మొదలుపెట్టి నెల రోజులు అయ్యింది. అంతర్జాతీయ స్థాయికి సమస్యను తీసుకెళ్లింది. వారం రోజులుగా శ్రీరెడ్డి ఉద్యమం పక్కదారి పట్టించదనే విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా దాడి మొదలైంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేయటం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పటం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఇలాంటి వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టటం సంచలనంగా మారింది. కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నట్లు కూడా భావిస్తున్నారు.

1st time felt alone in this world..thank u every one

Sri Reddy 发布于 2018年4月17日周二

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy