శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి హరీష్

 

HARISH SRISAILAMఅచ్చంపేట పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో బిజీగా గడుపుతున్నారు మంత్రి హరీష్ రావు. ఈ క్రమంలోనే శ్రీశైలం భ్రమరాంభా మల్లికార్జున స్వామివారిని హరీష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం (జూలై-2) ఉదయం ఆలయం చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు, సిబ్బంది శాస్ర్తోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మల్లన్న బ్లాక్‌ ను మంత్రి ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు.

అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్రాబాద్ మండలం మాదవానిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:45 గంటలకు అమ్రాబాద్ మండల కేంద్రంలోని గోదాం, మార్కెట్ యార్డును ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy