శ‌త‌మానం భ‌వ‌తి టీంకి సీఎం ప్ర‌శంస‌లు

shatamanam-kcrశర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా శతమానం భవతి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేగేశ్న సతీష్ రూపొందించాడు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయింది.. ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబ‌ట్ట‌డమే కాదు అభిమానుల ఆదరాభిమానులు అందుకుంది. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక అయ్యింది. ఇటీవ‌ల‌ చిత్ర నిర్మాత దిల్ రాజు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా నేష‌నల్ అవార్డు అందుకున్నారు. తాజాగా రాష్ట్ర  సీఎం కేసీఆర్ శ‌త‌మానం భ‌వ‌తి టీంని అభినందించారు. ఇలాంటి సినిమాలు మ‌రెన్నో చిత్రీక‌రించాల‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy