షమికి పోలీసులు సమన్లు

SHAMIటీమిండియా క్రికెటర్ మొహ్మద్ షమికి కోల్‌కతా పోలీసులు మంగళవారం (ఏప్రిల్-17) సమన్లు జారీ చేశారు. బుధవారం (ఏప్రిల్-18) మధ్యాహ్నాం 2 గంటలకు విచారణకు హాజరు కావాలన్నారు. క్రికెటర్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. గృహి హింస చట్టం కింద ఆమె కేసును ఫైల్ చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా హాజరుకావాలంటూ షమికి పోలీసులు సమన్లు ఇచ్చారు. కేసు నడుస్తున్న సమయంలో తనకు 10 లక్షలు ఇవ్వాలని హసీన్ జహాన్ డిమాండ్ చేసింది. అందులో ఏడు లక్షలు కుటుంబ నిర్వహణకు, మరో 3 లక్షలు కూతురు కోసం అని తన ఫిర్యాదులో జహాన్ కోరింది. ఈ కేసును వెంటనే విచారించాలని కోల్‌కతా పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆమె ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy