షమీ గురించి గంగూలీకి ముందే తెలుసు: హసీన్

ganguly-HASEENకొద్ది రోజుల క్రితం టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ లైంగిక వేధింపులు, ఆక్రమ సంబంధాల ఆరోపణలు చేసింది. అయితే ఈ వివాదాన్ని బయటపెట్టే ముందు ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో చర్చించానని హసీన్ తెలిపింది. షమీ తప్పుదారిలో నడుస్తున్నాడని, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయనకు చెప్పా అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ వారంలో నాకు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆయన ఫోన్ కోసం నేను ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే ఇది వ్యక్తిగత విషయం కావడంతో.. దీని గురించి ఆయన పట్టించుకోవడం లేదని అనుకుంటున్నట్లు హసీన్ చెప్పింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy