షాకింగ్ ఇన్సిడెంట్ : సినిమా ధియేటర్ లో ఇలా కూడా చనిపోతారా!

theఎవరూ ఊహించని విధంగా సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లిన అతీక్ రఫీక్(24) అనే ఓ వ్యక్తి  చనిపోయాడు. ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌ హామ్‌ లో స్టార్‌ సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని వ్యూ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.

మార్చి 9న వ్యూ థియేటర్‌ లో తన భార్యతో కలసి గోల్డ్‌ క్లాస్‌ లగ్జరీ సీటులో కూర్చుని సినిమా చూస్తున్నాడు రఫీక్. తన సెల్‌ఫోన్‌ రెండు సీట్ల మధ్యలో కింద పడిపోయింది. ఫోన్ తీసుకోవటానికి కిందకి వంగాడు. అదే సమయంలో ఆయన సీటుకి ఉన్న ఎలక్ట్రానిక్‌ ఫుట్‌ రెస్ట్‌ అతని తలపై పడింది. దీంతో ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. ఫుట్ రెస్ట్ ను పైకి లేపటానికి ప్రయత్నిస్తూనే అలాగే కుప్పకూలిపోయాడు.

థియేటర్ సిబ్బంది వచ్చి కుర్చీ ఫుట్ రెస్ట్ విరగ్గొట్టి అతడిని బయటకు తీశారు. సీరియస్ కండిషన్‌లో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని మరణానికి భయంతో వచ్చిన గుండెపోటు అని తేల్చారు వైద్యులు. ధియేటర్ లో ఎలక్ట్రానిక్ ఫుట్ రెస్ట్ వల్ల ఓ ప్రేక్షకుడు చనిపోవటం ఇంగ్లండ్ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని థియేటర్‌ యాజమాన్య‌ం ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy