షాకింగ్ : జూబ్లీహిల్స్ లో రూ.5కోట్ల పాతనోట్లు పట్టివేత

old-notes-arrestedహైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పాత నోట్ల ముఠా పట్టుబడింది. ఐదు కోట్ల రూపాయల విలువైన పాత 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. శ్రీనివాసరావును అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాత నోట్లు మార్చటానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే పట్టుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్ ఎంటర్ ప్రైజస్ ఆఫీసులో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

పాతనోట్ల మార్పిడికి పోస్టాఫీసులు, జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులకు RBI అవకాశం ఇచ్చిన 24 గంటల్లోనే పాతనోట్ల ముఠా వెలుగుచూడటం అనుమానాలకు తావిస్తోంది. ఈ బ్యాంకుల ద్వారా తన దగ్గర ఉన్న రూ.5 కోట్ల పాత నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కోట్లలో నగదు మార్పిడి జరుగుతుందన్న సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శ్రీనివాసరావుపై గతంలోనే డ్రగ్స్ రవాణా కేసు కూడా ఉంది. ఈయన సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులతోనూ సంబంధాలు ఉన్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy