షాక్: ఆధార్ కార్డులు..బ్యాంకు ఖాతాలు లీక్

ADHAARఆధార్ డేటా లీక్ అవుతోందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలా అయ్యే ఛాన్స్ లేదని స్పష్టం చేసింది. ఆధార్ కార్డుల లీకేజీకి సంబంధించి జార్ఖండ్  వ్యవహారం మర్చిపోకముందే  ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరోభారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు ఆధార్‌కార్డులు,  పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీకయ్యిందని తాజా రిపోర్ట్‌ వెల్లడించింది.  ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల  నిర్లక్ష్యాన్ని ఎత్తి  చూపింది.

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ  సోమవారం (మే1) విడుదల చేసిన  కొత్త పరిశోధనా నివేదిక ప్రకారం  కేంద్ర మంత్రిత్వశాఖ,రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్దతుల ద్వారా 135 మిలియన్ల ఆధార్  నంబర్లు లీక్‌ అయ్యాయి. వివిధ రకాల  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అక్రమ భద్రతా పద్ధతుల కారణంగా  రెండు నెలల్లో భారీగా డేటా బయటపడిందని తెలిపింది. నాలుగు ప్రభుత్వ డేటాబేస్లను  ఇది  అధ్యయనం చేసింది. మొదటి రెండు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినవి. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) డాష్‌బోర్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) పోర్టల్.

మిగిలిన రెండు  డేటాబేస్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి.  రాష్ట్ర ప్రభుత్వ సొంత NREGA పోర్టల్ ,  రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన  ఆన్లైన్ డాష్‌ బోర్డ్‌ “చంద్రన్న బీమా” ది.  ఈనాలుగు పోర్టల్స్‌ దవ్ఆరా 130-135  మిలియన్ల దాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే  కోటి దాక బ్యాంక్‌ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని  అధ్యయన వేత్తలు తెలిపారు. ఈ డేటా లీక్‌  లో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)  పాత్రపై విశేషంగా  ప్రస్తావించారు. ఇటీవల జార్ఖండ్‌ ప్రభుత్వ విభాగ వెబ్‌సైట్‌లో లక్షలాది మంది పెన్షన్‌ లబ్ధిదారుల ఆధార్, మొబైల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడి కావడంతో కేంద్రం స్పందించింది.  రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్‌సైట్లలో లబ్ధిదారుల ఆధార్‌ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy