షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి: షాద్‌న‌గ‌ర్‌ పాత జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్య‌క్తులు అక్కడిక్కడే మృతి చెందారు. నందిగామ మండల పరిధిలోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న‌ విష్ణువర్ధన్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం(నవంబర్.8) సాయంత్రం డ్యూటీ ముగించుకొని షాద్ నగర్ వస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగింది. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మాక్స్ ట్రాక్ బోలోరా వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఓవర్ స్పీడ్‌తో వాహ‌నాన్ని నడిపాడు. బోలోరా వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy