షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి

Untitled-23పండగల సీజన్ నడుస్తోంది.. వినాయక చవితి అయిపోయింది… ఇక దసరా, దీపావళి రాబోతున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు వ్యాపార సంస్థలు అట్రాక్టివ్ ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. వీటి మోజులో పడి  చాల మంది బడ్జెట్ తలకిందులు చేసుకుంటారు. సో కొన్ని టిప్స్ పాటిస్తే షాపింగ్ ను ఎంజాయ్ చేయడమేకాక అనవసర ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో వెల్త్ మేనేజ్ మెంట్ తెలియచెప్పే ఇట్స్ యువర్ మనీలో తెలుసుకుందాం.

పండగల ఆఫర్ సీజన్ మొదలైందంటే చాలు.. షాపింగ్ ఎక్కడ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఆశాడం ఆ తరువాత వచ్చే పండగల సీజన్ లో ఆఫర్లుంటాయని  షాపింగ్ ను అందరు పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఫ్రీ గా వస్తోందనో, తక్కువ ధరకే ఇస్తున్నారనో.. అవసరం లేకున్నా షాపింగ్ చేస్తే జేబుకు చిల్లు పడి బడ్జెట్ పై అదనపు భారమే అన్నది గుర్తుంచుకోవాలి.

జీతానికి అనుగుణంగా నెలవారీ ఖర్చుల కోసం బడ్జెట్ ను తయారు చేసుకుంటున్నట్లుగా షాపింగ్ కు కూడా బడ్జెట్ తయారుచేసుకోవాలి. షాపింగ్ చేయాల్సిన వస్తువుల జాబితా తయారుచేసుకుని వాటికి ఎంత వరకు భరించగలమో లెక్క వేసుకోవాలి. తయారు చేసుకున్న బడ్జెట్ లో ఏమైనా అనవసర ఖర్చులున్నాయా, ఎంత వరకు తగ్గించగలమనేది చూసుకుని బడ్జెట్ కు అనుగుణంగా మరోసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఖర్చులపై ముందుగానే నియంత్రణ ఉంటుంది.

కంపెనీలు, షోరూంలు ప్రకటించే ఆఫర్లను తెలుసుకొని.. రిక్వైర్ మెంట్ కు సరిపోయే వాటిని ఎంచుకుంటే బడ్జెట్ తగ్గుతుంది. చాలామంది ఉచిత ఆఫర్లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. రెండు కొంటే మూడోది ఉచితం అంటే చాలు.. అవసరం లేకున్నా మూడోదాని కోసం రెండొది కొంటుంటారు. దీంతో ఒకదానికి అదనంగా మరో దాన్ని కొంటే ఖర్చులు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆఫర్లు బడ్జెట్ ను తగ్గించేలా ఉండాలి కానీ పెంచకూడదు.

షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల జోలికి పోకపోవడమే మంచిది. కార్డు ద్వారా షాపింగ్ చేస్తే బడ్జెట్ పరిధి దాటే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు నగదుతోనే షాపింగ్ పూర్తి చేయండి.  అవసరాలకు తగ్గట్టుగా ఏమేం సరుకులు కావాలో ముందుగా లిస్ట్‌ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ప్యాకింగ్‌ ఆర్భాటాలు చూసి కొంటే మీ బడ్జెట్‌ భారమవుతుంది. అంతేకాదు అసలు కొనాల్సిన వస్తువులను మరిచిపోయే ప్రమాదముంది. ఏది కావాలి.. ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలే పోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది.

చాలా వరకు షాపింగ్ మాల్స్ లో వినియోగదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా కావల్సిన సౌకర్యాలను ఏర్పాటుచేస్తారు. ఎ.సి., మ్యూజిక్, మ్యాగజైన్లు, జ్యూస్‌సెంటర్‌, స్నాక్స్‌ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కతోవ పట్టిస్తాయి. ఒక పక్క మ్యూజిక్‌ వింటూ స్నాక్స్‌ నములుతూ వస్తువుల ధరలను అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని ఆ వస్తువువైపే పెట్టండి. వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్‌కి వెళ్లండి. వారిని వెంట తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు, ఐస్‌క్రీం, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే ఉంటారు. ఇది షాపింట్ బడ్జెట్ పై అదనపు భారమవుతుంది.

కొన్ని వస్తువులపై ఫ్రీ ఆఫర్‌ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు నిజంగా అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి . కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. దీని కారణంగా చివరకు బిల్‌ ఎక్కువవుతుంది. కాబట్టి కొనేముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు తీసుకున్న వస్తువులకు మ్యానువల్‌ బిల్‌ ఉండదు. ప్రతీది స్కాన్‌ చేసి బిల్‌చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది కాబట్టి స్కానర్‌ ఇచ్నిన బిల్‌ కరెక్ట్‌గా ఉందో లేదో తిరిగి చెక్‌ చేయండి షాపింగ్‌లో ఈ మాత్రం జాగ్రత్తలు అవసరం.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy