షెడ్యూల్ ఇదే : నేటి నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్

POLICET ONLINE

పాలిసెట్ -2018లో పాసైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాల కోసం ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో ఫీజు, ఎంట్రీ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది టెక్నికల్ ఎండ్యుకేషన్. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది సాంకేతిక విద్యాశాఖ. మే 14 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. టెన్త్ పాసై, పాలిసెట్‌-2018లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపింది.

CBSE/ ICSE విద్యార్థుల ప్రవేశాలు మాత్రం వారి టెన్త్ ఉత్తీర్ణతను బట్టి ఉంటాయని వివరించింది. విద్యార్థులు మే 14 నుంచి మే 18వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో ((https://tspolycet. nic.in)) రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, SC, ST విద్యార్థులైతే రూ.300, ఇతరులు రూ.600 ప్రాసెసింగ్‌ ఫీజు ఆన్‌ లైన్‌ ..క్రెడిట్‌/డెబిట్‌కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించేటప్పుడు విద్యార్థి తన మొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ, ఆధార్‌ నంబరు ఇవ్వాలని, ఇన్ కమ్ సర్టిఫికెట్ (వర్తించే వారు) నంబరు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత హెల్ప్‌ లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కు హాజరు కావాలని చెప్పింది.

ఎంట్రీ షెడ్యూల్

14–5–2018 నుంచి 18–5–2018:
ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
15–5–2018 నుంచి 19–5–2018:
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
15–5–2018 నుంచి 21–5–2018:
వెరిఫికేషన్‌ పూర్తయిన వారికి వెబ్‌ ఆప్షన్లు
23–5–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు
23–5–2018 నుంచి 27–5–2018 వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లించడంతోపాటు కాలేజీలో చేరేందుకు ఆన్‌ లైన్‌ లో అంగీకారం తెలపాలి. సీట్లు పొంది ఫీజు చెల్లించకుండా, అంగీకారం తెలుపకపోతే రెండో దశలో అవకాశం ఉండదు. మొదటి దశలో సీటు వస్తే అంగీకారం తెలిపి, ఫీజు చెల్లించాలి. వారి పాత ఆప్షన్ల ప్రకారం కాలేజీలు, సీటును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
24–5–2018 నుంచి 27–5–2018: సీట్లు రాని వారు ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోకపోతే ముందుగా వారు ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
30–5–2018: సీట్లు మెరుగుపరుచుకోవాలని అంగీకారం తెలిపిన వారికి, మొదటి దశలో సీట్లు రాని వారికి రెండో దశ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను టెన్త్‌ అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ రాయబోయే వారికి కేటాయిస్తారు.
30–5–2018 నుంచి 1–6–2018 వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరికలు
1–6–2018 నుంచి: తరగతులు ప్రారంభం

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy