షెడ్యూల్ ఇదే : నేడు హైదరాబాద్ కి గడ్కరీ

GATKARI HYDగ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు … మరో నాలుగు భారీ ప్రాజెక్టులకు శనివారం (మే-5) శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉప్పల్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్లతోపాటు.. రోడ్ల విస్తరణ పనులు మొదలు పెట్టనున్నారు. మరోవైపు సిటీలో పర్యటించనున్న కేంద్ర మంత్రి… పార్టీతో పాటు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కు రానున్న గడ్కరీ…ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో కోర్ కమిటీ సమావేశంలోనూ పాల్గొంటారు.

ఆ తర్వాత వెయ్యి 523 కోట్ల విలువైన భారీ ఫ్లైఓవర్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి. ఉప్పల్, అంబర్ పేట్ ఫ్లైఓవర్లతో పాటు ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు అధికారులు హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టులతో…. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు తుమ్మల నాగేశ్వర రావు.

ఈ పనుల్లో అధికభాగం GHMCతో పాటు రాష్ట్ర సర్కార్ భరిస్తోందన్నారు హోంమంత్రి నాయిని. అయితే బీజేపీ నాయకులు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు సర్కార్ SRDP ద్వారా ప్లైఓవర్లు, అండర్ పాస్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు మంత్రులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy