షెడ్యూల్ రిలీజ్: ఏప్రిల్ 13 నుంచి సమ్మర్ హాలిడేస్

schoolరాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్‌  రిలీజ్ అయ్యింది. స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్‌ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది.  దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య మంగళవారం (ఆగస్టు29) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్‌ ప్రకారం.. 2017–18 అకాడమిక్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్‌ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 1న సూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి.

కేలండర్‌ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా సిలబస్ పూర్తి చేసి.. రివిజన్‌ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి.
విద్యా కేలండర్‌..

హై స్కూల్స్ ఆప్షనల్‌ హాలిడేస్‌ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్‌ హాలిడేస్‌ తీసుకుని.. పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీల్లేదు. హెడ్ మాస్టర్  గరిష్టంగా స్కూల్ లోని 30 శాతం మంది టీచర్లకే ఆప్షనల్‌ హాలిడేస్‌ను మంజూరు చేయాలి. మిగతా వారితో స్కూళ్లను కొనసాగించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు.

అక్టోబర్‌లో జాతీయ క్రీడలు ప్రారంభం కానున్న క్రమంలో… సెప్టెంబర్‌ 2లోగా మండల, డివిజన్‌ స్థాయి, సెప్టెంబర్‌ 20లోగా జిల్లా స్థాయి గేమ్స్‌ పూర్తి చేయాలి. అక్టోబర్‌ 4వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో గేమ్స్‌ పూర్తి చేసి.. జాతీయ స్థాయికి ఎంపికైన టీములను పంపించాలి.

పాఠశాల వార్షిక దినోత్సవాన్ని జనవరి/ఫిబ్రవరిలో, బాలసభను ప్రతి నెల 4వ శనివారం, మాస్‌ డ్రిల్‌/యోగాను ప్రతి నెల మొదటి, మూడో శనివారం నిర్వహించాలి.

సెలవులు..

20–9–2017 నుంచి 4–10–2017 వరకు దసరా సెలవులు

24–12–2017 నుంచి 28–12–2017 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్‌మస్‌ సెలవులు

12–1–2018 నుంచి 16–1–2018 వరకు మిషనరీ స్కూళ్లు మినహా ఇతర పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
డిజిటల్‌ తరగతుల షెడ్యూల్‌.. 

10వ తరగతి : ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు

9వ తరగతి : ఉదయం 11:30 నుంచి 12:15 వరకు

8వ తరగతి : మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు

7వ తరగతి : 2:45 నుంచి 3:30 వరకు

6వ తరగతి : 3:40 నుంచి 4:20 వరకు

స్కూల్స్ టైమింగ్స్..

హై స్కూల్ : ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు.

అప్పర్ ప్రైమరీ స్కూల్ : ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.

ప్రైమరీ స్కూల్ : ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు.

పరీక్షల షెడ్యూల్స్..

31–7–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1

19–9–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2

23–10–2017 నుంచి 28–10–2017 వరకు: సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1

30–11–2017లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–3

31–1–2018లోగా: టెన్త్‌ విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4

28–2–2018లోగా: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4

2–4–2018 నుంచి 9–4–2018 వరకు: సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2

10–4–2018న: జవాబు పత్రాల అందజేత

11–4–2018న: తల్లిదండ్రులతో సమావేశం, ప్రోగ్రెస్‌ కార్డుల అందజేత

పదోతరగతి వారికి 28–2–2018లోగా ప్రీఫైనల్‌ పరీక్షలు.. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy