షేవింగ్ క్రీమ్ పై షారుఖ్ కు లీగ‌ల్ నోటీస్‌

sharuk hshavingషేవింగ్ క్రీమ్  సరిగా లేదంటూ.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు లీగ‌ల్ నోటీస్ పంపించాడు ఓ వినియోగదారుడు. షారుఖ్ ఎండార్స్ చేస్తున్న ఓ షేవింగ్ క్రీమ్ పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌న ముఖంపై రాషెస్ వ‌చ్చిన‌ట్లు భోపాల్‌కు చెందిన రాజ్‌కుమార్ పాండే అనే  లీగ‌ల్ నోటీస్ పంపించాడు. ఇండియా నంబ‌ర్ వ‌న్ షేవింగ్ క్రీమ్ అంటూ షారుక్ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని ఆ వ్యక్తి వినియోగ‌దారుల కోర్టులో కేసు వేశాడు. ఈ క్రీమ్ వాడ‌టం వ‌ల్ల ముఖంపై మ‌చ్చ‌లు వ‌చ్చాయ‌ని… దీనికోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ట్లు అత‌ను త‌న ఫిర్యాదులో తెలిపాడు. అత‌ని వాద‌న విన్న త‌ర్వాత మెజిస్ట్రేట్ కాశీనాథ్‌.. షారుఖ్ కు నోటీస్ పంపించారు. అత‌నితోపాటు ఈ షేవింగ్ క్రీమ్ ఓన‌ర్‌, అది అమ్మిన స్థానిక షాప్ య‌జ‌మాని, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్‌కి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రీమ్ క్వాలిటీని తాను మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ డిపార్ట్‌మెంట్‌లో పరీక్షల కోసం ఇచ్చాన‌ని…. అది చాలా నాసిర‌కంగా ఉన్న‌ట్లు తేలింద‌ని కూడా రాజ్‌కుమార్ త‌న ఫిర్యాదులో చెప్పాడు. షారుఖ్ సాధార‌ణంగా వీ-జాన్ షేవింగ్ క్రీమ్ యాడ్‌లో క‌నిపిస్తాడు. అత‌ను ఫిర్యాదులో తెలిపింది ఇదే షేవింగ్ క్రీమా..కాదా అన్న‌ది మాత్రం తెలియ‌లేదు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy