
ప్రపంచీకరణ ప్రభావం…..మాట్లాడే భాషలపై కూడా పడింది. జీవనదుల్లా సాగాల్సిన భాషలు….ఒక్కటొక్కటిగా అంతరిస్తున్నాయి. కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుచుకునే….తెలుగు కూడా అంతరించడానికి రెడీగా ఉన్నదన్న వార్తలు.. భాషాభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలో హిందీ తరువాత… ఎక్కువ మంది మాట్లాడేది… తెలుగునే. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న భాషల్లో…. తెలుగుకు 15 వ స్థానం ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం…..మన దేశంలో 428 భాషలున్నాయి. అయితే ప్రస్తుతానికి 415 మాత్రమే ఉనికిలో ఉన్నాయి. అంటే…. ఈ పన్నెండేళ్ల కాలంలో……ఒకటి కాదు….రెండు కాదు….పదమూడు భాషలు అంతరించిపోయాయి. తెలుగు భాష విషయంలోనూ ….ఇలాంటి ఆందోళనే వ్యక్తమవుతోంది. అయితే, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న తెలుగు భాషకు ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు భాషా శాస్త్రవేత్తలు. తెలుగు బతుకుతుందని భరోసా ఇస్తున్నారు.
మాత్రుభాష లో విద్యా బోధన తగ్గుతున్న అన్ని ప్రాంతాల్లోనూ….అక్కడి భాషలకు ఈ సమస్య వస్తోంది. మన దేశంలో ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండే భాషలు…..ఇప్పుడు వందల సంఖ్యకే పరిమితమయ్యాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే…ప్రతి వృత్తికి, కులానికి ఒకప్పుడు… ప్రత్యేకంగా ఒక భాష ఉండేది. ఇప్పుడు వ్రుత్తులు పోయాయి. వ్రుత్తులతో పాటు….ఆ సమూహాలు మాట్లాడే భాషలూ పోయాయి. ఏ భాష అయినా సరే….వాడుకలో లేకపోతే….నూకలు చెల్లినట్లే. నిత్య వ్యవహారంలో ఉండే భాష ఏదైనా సరే నాలుగు కాలాల పాటు సేఫ్.
1964లో తెలుగు ను…అధికార భాషగా గుర్తించారు. అనేక పోరాటాల తరువాత… 2008 లో తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు భాష పరిరక్షణ విషయంలో… మనం కొంత వెనకబడ్డా, తెలుగు భాష….జనానికి దూరం కాలేదు. ప్రజల నాలికలపై నర్తిస్తూనే ఉంది. నిత్య వ్యవహారాల్లో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ….లక్షల్లో కాదు, కోట్లలో ఉంది. సహజంగా …ఒక భాష అంతరించిపోవాలంటే, మాట్లాడే వాళ్లు ….కనీసం లక్ష మంది కూడా ఉండకూడదు. సో….తెలుగు భాషకు వచ్చిన ముప్పేమీ లేదు.
అలా అని.. భాషను నిర్లక్యం చేయడం ఏమాత్రం సరైంది కాదు. ఒక వేళ ప్రభుత్వం పట్టించుకోకపోయినా… ప్రజలు పోరాటం చేయాలి. భాషను రక్షించుకోవడానికి ఉద్యమించాలి. ఇవేమీ చేయకపోవడం వల్లనే…..ప్రపంచవ్యాప్తంగా వెయ్యి భాషలు అంతరించిపోయాయి. ఆఫ్రికాలో 46, అమెరికాలో 170, ఆస్ట్రేలియలో 78, యూరప్ లో 12, ఇలా అంతరించాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఎదురు లేకుండా ముందుకు సాగుతోంది ఒక్క ఇంగ్లీషు భాషే. మిగతా భాషలేవీ…. ఇంగ్లీషు దరిదాపులకు కూడా రావడం లేదు. అనేక అంశాల్లో అమెరికకు పక్కలో బల్లెంలా తయారైన చైనాలోని … మాండరిన్ భాష కూడా ఒడిదుడుకులకు లోనవుతోంది. భాష జీవనది లాంటిది. నిరంతర ప్రవాహంలో కొన్నిసార్లు ఇతర భాషల పదాలను కూడా ఇముడ్చుకుని భాష నడవాల్సి ఉంటుంది. అలా నడిచిన భాషే …జనంలో ఉంటుంది. సజీవంగా ఉంటుంది. కాబట్టి…తెలుగుకు వచ్చిన ముప్పేమీ లేదు.