సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

kachigudaసంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపారు రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్. ఈ మేరకు కాచిగూడ- కాకానాడ(07425/07426) ప్రత్యేక రైలు జనవరి 5,12,19,26 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6,13,20,27 తేదీల్లో సాయంత్రం 5.50కి కికినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-విశాఖపట్నం(07016) ప్రత్యేక రైలు జనవరి 2,9,16,23,30 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కి విశాఖ చేరుకుంటుంది. తిరుపతి-కాచిగూడ (07146) ప్రత్యేక రైలు జనవరి 4,11,18,25,ఫిబ్రవరి 1వ తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy