సంక్షేమ పథకాలపై GST ఎత్తేయండి: జితేందర్ రెడ్డి

jitenderపార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ పథకాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కౌన్సిల్ దృష్టికి తీసుకువెళతామని మంత్రి జైట్లీ చెప్పారు. తర్వాత.. లోక్ సభలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ బిల్లు.. రాజ్యసభలో సెంట్రల్ హిమాలయన్ స్టేట్స్ డెవలప్ మెంట్ బిల్లులపై చర్చలు జరిగాయి. 2 సభలు.. మంగళవారానికి వాయిదా పడ్డాయి.

రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై జీఎస్టీ తీసేయాలని.. లోక్ సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. టీఆర్ఎస్ ఎంపీలు. పన్నులు 18 శాతానికి పెరుగుడుతో.. రాష్ట్రంపై 19 వేల కోట్ల భారం పడ్తందన్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ కు చెప్తామన్నారు మంత్రి జైట్లీ.

అంతకు ముందు.. హిరోషిమా నాగసాకిలో అణుబాంబు దాడి సంఘటనను గుర్తు చేసుకున్న లోక్ సభ మృతులకు నివాళి అర్పించింది. తర్వాత.. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ బిల్లు మీద సభలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ స్టిట్యూట్ ప్రవేశపెట్టబోతున్నట్టు.. కేంద్రం చెప్పింది. మరి.. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు ఇస్తామన్న ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీ సంగతేందని.. టీఆర్ఎస్ అడిగింది.

అందరి అభిప్రాయాలు తీసుకున్న కేంద్రం.. చివరికి బిల్ పాస్ చేసింది. తర్వాత.. సభలో జీరో అవర్ జరిగింది. ఉద్యోగుల పే స్కేళ్లపై కేంద్రం నిర్ణయం పెండింగ్ లో ఉండడంతో.. సిబ్బందికి కష్టమవుతుందని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. జీరో అవర్ అయిపోగానే.. సభ మంగళవారానికి వాయిదా పడింది. ఇక.. రాజ్యసభలో.. ప్రారంభంలోనే విపక్షాల గొడవతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తర్వాత.. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు జరిగాయి. ప్రయివేట్ మెంబర్ బిల్లు కింద… సెంట్రల్ హిమాలయన్ స్టేట్స్ డెవలప్ మెంట్ బిల్లు 2016పై .. సభల చర్చ జరిగింది. హిమాలయాల పరిధిలో ఉన్న రాష్ట్రాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు చెప్పింది. తర్వాత.. బిల్లు విత్ డ్రా అయ్యింది. చైర్మన్ అనుమతితో.. సమస్యల పై కాసేపు సభ్యులు మాట్లాడారు. చివరికి.. మంగళవారానికి సభ వాయిదా పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy