సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీస్కెళ్లాలి: సీఎం

08-1444304076-resized-kkp-0558టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరిగింది.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని.. చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు.. ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాల్సిందిగా కోరారు. దసరాలోపు పార్టీ కమిటీలు, నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతదని దసరా తర్వాత జిల్లాల్లో పర్యటిస్తామని సీఎం తెలిపారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైయ్యారు.

naini08సమావేశంలో చర్చించిన విషయాలు తెలిపిన హోం మంత్రి నాయిని

  •  పాత, కొత్తవారిని కలుపుకొని పార్టీని పటిష్టం చేయాలి
  • అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఉండేలా రాష్ట్ర కమిటీ ఏర్పాటు
  • దసరాలోపు కమిటీలు ఏర్పాటు
  •  పార్టీకోసం కష్టపడ్డ వారిని ఎవ్వరినీ మరువబోము
  • సంక్షేమ పథకాలను ఎప్పుడు ప్రజా ప్రతినిధులు సమీక్షించాలి
  • పెన్షన్లు… రేషన్ కార్డులు లేనివారికి వెంటనే అందిలా నేతలు చొరవ
  •  రెండో విడత మిషన్ కాకతీయలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనాలి
  • ప్రతి నియోజకవర్గంలో పనులు సక్రమంగా జరిగేలా చూడాలి
  •  ఇంటింటికీ మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ పనులను పర్యవేక్షించాలి
  •  ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎప్పటికిప్పుడు పర్యవేక్షన
  • రెండు.. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలి

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy