సంఘమిత్ర : కోలీవుడ్ లో మరో సంచలనం

18486018_1413112728736357_3878679199066599446_nభారతదేశ చలనచిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తున్నారు మన దర్శకులు. రాజమౌళి తీసిన బాహుబలి ఇప్పటికే గ్లోబల్ రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా కోలీవుడ్ దర్శకుడు సుందర్.సి అదే బాటలో సినిమాను ప్లాన్ చేశాడు. సంఘమిత్ర అనే టైటిల్ తో రెండు భాగాల్లో ఈ చిత్రం తెరక్కెక్కబోతోంది. 8వ శతాబ్ధంలో జరిగిన ఓ తమిళ రాజు జీవితకథను సినిమాగా రూపోందించనున్నారు. గురువారం కేన్స్ లో జరిగిన ఫిల్మ్ నైట్ లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

జయం రవి,శృతిహాసన్,ఆర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. థినందల్ స్టూడియోస్ లిమిటెడ్ సంస్ధలో 101వ నిర్మాణం కావడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మాణ పనులు మొదలెట్టారు. మొత్తానికి బాహుబలి స్ఫూర్తితో ఇలాంటి చిత్రాలు రావడంతో సినీ పరిశ్రమకు మంచిదని చెప్తున్నారు విశ్లేషకులు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy