సంచలన తీర్పు : దళిత యువకుడి హత్యలో ఆరుగురికి మరణ శిక్ష

marriageతమిళనాడులో శంకర్ అనే దళిత యువకుడి హత్య కేసులో తీర్పు వెల్లడైంది. డిసెంబర్ 12వ తేదీ తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ సెషన్స్ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఆరుగురికి మరణశిక్ష విధించింది. మొత్తం 11 మందిపై విచారణ జరిగింది. అందులో ఆరుగురికి మరణశిక్ష ఖరారు కాగా, ఒకరికి జీవితఖైదు పడింది. మరొకరికి ఐదేళ్ల శిక్ష ఖరారు చేశారు. న్యాయమూర్తి అలమేలు నటరాజన్ ఈ తీర్పును ఇచ్చారు.

కేసు వివరాలు ఇవీ :

2016 మార్చి 13వ తేదీన ఉడుమల్‌పేట్ బస్టాండ్ లో శంకర్ దంపతులపై దాడి జరిగింది. అందులో యువకుడు శంకర్ స్పాట్ లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య కౌశల్య కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొంది కొనుకున్నది. బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే.. నరికి చంపటం సంచలనం అయ్యింది. ఈ వీడియో తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. పోలీసులు కూడా ఆ కేసులో వెంటనే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనపై మొత్తం 1500 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశారు. అగ్రవర్ణానికి చెందిన కౌశల్యను దళిత సామాజిక వర్గానికి చెందిన శంకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనిపై కోపంతో రగిలిపోయిన అమ్మాయి కౌసల్య తల్లితండ్రులు, బంధువులు శంకర్‌పై దాడి చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. విచారణ నవంబర్‌లోనే పూర్తి అయ్యింది. తుది తీర్పులో ఆరుగురికి మరణశిక్ష పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy