‘సంచార్‌ క్రాంతి యోజన’ : ఉచితంగా 55 లక్షల స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ

_90725565_thinkstockphotos-523564455ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా 55 లక్షల స్టార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం. బుధవారం(ఆగస్టు-23) సీఎం రమణ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ పథకానికి ‘సంచార్‌ క్రాంతి యోజన’ అని పేరు పెట్టారు. రెండేళ్లలో రెండు దశల కింద ఈ పథకాన్ని అమలు చేస్తారు.

మొదట వేయికిపైగా జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ పేదలు, కళాశాల విద్యార్థులకు 50.8 లక్షల ఫోన్లు అందజేస్తారు. రెండో దశలో 4.8 లక్షల ఫోన్లను 1000 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల వారికి ఇస్తామని పరిశ్రమ శాఖ మంత్రి అమర్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇంట్లోని మహిళల పేరు మీదనే వీటిని ఇస్తారు. వీటిని ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానం చేస్తారు. అయితే ఎలాంటి స్మార్ట్ ఫోన్లను ఇస్తారో ధరలు మాత్రం వెల్లడించలేదు.  ప్రభుత్వ భవనాలపై ఉచితంగా మొబైల్‌ టవర్లు పెట్టుకునేందుకు టెలికాం కంపెనీలకు అనుమతి ఇస్తారు. డిజిటల్ ఇండియాగా దూసుకుపోతున్న భారత్ లో.. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy