సంజీవయ్య పార్కులో గులాబీల గుభాలింపు

Rose Gardenఅక్కడ ఎటు చూసినా.. గులాబీల గుభాళింపు పరిమళిస్తుంది. గాలికి రెపరెపలాడే గులాబీ సోయగాలు స్వాగతం చెబుతాయి. ఎన్నెన్నో.. వర్ణాలు.. అన్నింట్లో  అందాలు.. అన్న చందాన.. ఏ గులాబీ చూసినా.. మనసును పరవసింప చేస్తాయి. పెరట్లో  రెండు మూడు గులాబీ మొక్కలు ఉండి.. వాటికి ఐదారు గులాబీలు పూస్తే చాలు.. ఇక వాటితోనే గడిపేస్తాం. అలాంటిది 300 రకాల వెరైటీలు.. 3 వేల మొక్కలను ఒకేసారి చూస్తే… ఎంత ప్రశాంతంగా ఉంటుంది?  వేల గులాబీలను చూడాలంటే హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కులోని  రోజ్ గార్డెన్ కు వెళ్లాల్సిందే.

రెడ్, ఆరెంజ్, వైట్, ఎల్లో.. ఇక్కడ లేని రంగు లేదు. నాటు మొక్కల నుంచి హైబ్రేడ్ వరకూ ప్రతీ రకం గులాబీలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని మొక్కలకు ఆకుల కంటే.. గులాబీలే ఎక్కువ కనిపిస్తాయి. ఇక వింటర్ సీజన్ కావడంతో గులాబీలు ఎక్కువగా పూస్తున్నాయి.

పార్క్ కు వచ్చే వాకర్స్ రోజ్ గార్డెన్ లో కాసేపు ఆహ్లాదంగా గడుపుతున్నారు. అన్ని రకాల గులాబీలను ఒక్కచోటే చూసి మురిసిపోతున్నారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు వీటి అందాలకు ఫిదా అవుతున్నారు. ఇన్ని రకాల గులాబీలు చూస్తుంటే ముచ్చటేస్తుందంటున్నారు. ఫ్యామిలీతో కాసేపు ఆహ్లాదంగా గడపడంతో పాటు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా.. వీటిని చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో మీరూ ఓసారి రోజ్ గార్డెన్ కు వెళ్లిరండి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy