సండే విందు… సఫారీలకు భలే పసందు

Mane Course: Hungry Lions Feast On A Hippoఅది జాంబియాలోని అటవీ ప్రాంతం… సౌత్ లుంగ్వానా వాలే. ఎంత అడవి అయినా… అక్కడా కరువు సహజమే కదా… ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సింహాలు.. ఆ కరువు బారిన పడ్డవే. ఈ సమయంలోనే ఇవి ఉంటున్న చోటికి ఒక హిప్పీ వచ్చింది. నిమిషం ఆలస్యం చేయకుండా… వెంటనే పంజాలు విసిరాయి… ఆ దెబ్బకు హిప్పీ.. ఔట్. ఇక తమ పని షూరూ చేశాయి. ముందు ఆడ సింహం… ఆ తర్వాత మగ సింహం. తమ నోటికి పని చెప్పాయి. తిన్నంత తిన్నాయి… ‘అమ్మ’ ఇక చాలనుకుంటూ..  వెళ్లిపోయాయి. వీటి తర్వాత ఎక్కడినుంచి వచ్చాయో ఏమో రాబందులు.. హిప్పీపై వాలి తమ వంతు వాటా అవి కానిచ్చాయి. ఈ తతంగాన్ని ఓ వైల్డ్ యానిమల్ ఫొటోగ్రాఫర్ క్లిక్ మన్పించాడు. ఆదివారం నాటి సంగతి ఇది… సండే విందు… ఆ సింహాలకు భలే పసందు అనుకుంటూ సోసల్ సైట్స్ లో పోస్ట్ చేయడంతో .. ఆసక్తిగా చూస్తున్నారు అందరూ…

2DC1620000000578-0-image-a-7_1445793290373 2DC161E400000578-0-image-a-9_1445793302283 2DC1617C00000578-0-image-a-4_1445793228858 2DC161F800000578-0-image-a-6_1445793246335

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy