సందడిగా మల్లన్న పట్నాల కార్యక్రమం

DUGGUఒగ్గు బీర్ల కళాకారులకు పింఛను ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్. వారసత్వంగా వస్తున్న కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం (ఏప్రిల్-15) కరీంనగర్ లో జరిగిన మల్లన్న పట్నాల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. శివసత్తుల పూనకాలు, బోనాల సందడితో.. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం మార్మోగింది.

గొల్ల కుర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెయ్యి నూట పదహార్ల మల్లన్న పట్నాల కార్యక్రమం వైభవంగా జరిగింది. పదకొండు వందల 16 మంది ఒగ్గు పూజారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి పట్నంపై ఓ జంట చొప్పున మొత్తం వెయ్యి నూటపదహారు జంటలు పూజలు చేశారు. ఒగ్గుడోలు కళాకారులు డిల్లం బల్లెం చప్పుళ్లతో స్టేడియం దద్దరిల్లింది.  కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ హాజరయ్యారు. కొమురవెల్లి మళ్లన్న దేవాలయానికి 30 కోట్లు ఇచ్చామన్నారు హరీశ్ రావు.

ఆలయ చైర్మన్ పదవి యాదవులకే ఇస్తామన్నారు. హైదరాబాద్ లో గొల్లకురుమలకు 10 ఎకరాల స్థలంలో 10 కోట్లతో సంక్షేమభవనం, హాస్టల్ కట్టిస్తామన్నారు.  ప్రాచీన కళలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి ఈటల. ఒగ్గు బీర్ల కళాకారులకు పించన్ మంజూరు అయ్యేలా  ప్రయత్నిస్తామన్నారు చెప్పారు. తలపాక ధరించి, బొగ్గుడోల, ఢమరుకం వాయించి సందడి చేశారు మంత్రి.  తెలంగాణలో బతుకమ్మ పండుగలాగే మల్లన్న పట్నాలు… ప్రత్యేక సంస్కృతిగా కొనసాగుతుందన్నారు మంత్రులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy