సందిగ్ధంలో యాక్సిస్ బ్యాంకు లైసెన్స్..

axisఅతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి యాక్సిస్ బ్యాంకు. ఎంతో మంది కస్టమర్లు ఖాతాదారులుగా ఉన్న ఈ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అక్రమ లావాదేవీల ఆరోపణల తో  యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్తలు వస్తున్నాయి. భారీ అక్రమ లావీదేవీలకారణంగా   ఇటీవల బ్యాంకుకు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై  వేటుపడటంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.  పెద్ద నోట్ల రద్దు తరువాత  భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు కేంద్ర  యోచిస్తోందటూ ప్రాంతీయ వార్తాపత్రిక (హిందీ) లో కథనాలు వచ్చాయి.  అయితే  ఈ వార్తలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది.  తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం  తాము   కార్య కలాపాలాపాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలను, ఖాతాదారులను, తమ సిబ్బందిలో ఆందోళన రేపి, భయభ్రాంతులను చేసేందుకు పన్నిన  కుట్ర అని   తాము నమ్ముతున్నట్టు  స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో  తెలిపింది.  అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి  న్నామని తెలిపింది. లైసెన్స్ రద్దు కానుందన్న వార్తలతో సోమవారం మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం   నష్టపోయింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy