సంపాదనలో 10% దాతృత్వానికి.. సునీల్ మిత్తల్

mittalటెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిత్తల్ తన దాన గుణం చాటుకున్నారు. తమ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటాను దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. భారతీ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటా అయిన రూ.7వేల కోట్లను తమ దాతృత్వ సంస్థ భారతీ ఫౌండేషన్‌కు అందించనున్నట్లు మిత్తల్‌ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనకబడి ఉన్న యువతకు ఉన్నత, ఉచిత విద్యను అందించేందుకు సత్యభారతి పేరుతోయూనివర్శిటీని ఏర్పాటు  చేయనున్నట్లు తెలిపారు.  ఇందులో కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌ వంటి సాంకేతిక విద్యను బోధించనున్నట్లు తెలిపారు. ఉత్తర భారతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని… 2021 నుంచి దీని సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు మిత్తల్.తాము ప్రకటించిన మొత్తంలో ఎక్కువ శాతం యూనివర్శిటీకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భూమికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

ఇటీవల ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని తమ సంపదలో సగ భాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తమ సంపదలో సగం భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన ‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌’లో నీలేకని దంపతులు చేరారు. ఇప్పటికే విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, బయోకాన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఈ పథకంలో భాగస్వాములయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy