సంపాదన మొదలు పెట్టారా… మరి సేవింగ్స్ ఎలా?

0మొదటి సారిగా జాబ్ లో జాయిన్ అవుతున్నారా..? ఇప్పటిదాక ఒకరి సంపాదనపై ఆధారపడ్డ మీకు ఆర్ధిక స్వాతంత్ర్యం కళ్ల ముందు కనబడుతోందా..? ఇప్పటి దాకా అణిచి ఉంచుకున్న కోరికలను తీర్చేసుకోవాలని ఆతృతగా ఉందా..? అయితే మీ కోసమే ఈ స్టోరీ.. కోరికలను తీర్చుకోవడం తప్పుకాదు.. కానీ సంపాదనలో కొంత సేవింగ్స్ కోసం కూడా కేటాయించండి. ఇలా చేస్తే ఇప్పడు ఎంజాయ్ చేస్తున్న జీవితాన్నే చివరి దాక మరొకరిపై ఆధారపడకుండా ఎంజాయ్ చేయోచ్చు.. ఇదే వెల్త్ మేనేజ్ మెంట్ టిప్స్ చెప్పే… ఇవాళ్టి  ఇట్స్ యువర్ మనీ

బాధ్యతలు లేని జీవితం.. కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలా ఆంతా ఎంజాయే..  ఒక్క సారిగా జీవితంలో మార్పు.. నిన్నటి దాకా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆర్థికావసారాల కోసం మరొకరిపై ఆధారపడుతూ వచ్చిన వారికి ఒక్కసారిగా పగ్గాలు తెంచుకున్నామన్న భావన.. మొదటి సారిగా ఉద్యోగంలో చేరి ఫస్ట్ శాలరీ తీసుకోగానే అప్పటి వరకు అణుచుకున్న కోరికల లిస్ట్ బయటికి వస్తుంది.. నెల జీతాన్ని తెలియకుండానే పది రోజుల్లోనే ఖర్చు చేసేసి.. అరే అప్పుడే జీతం అయిపోయిందా..అని అనుకునే వారు ఎక్కువగా ఉంటారు.

వచ్చిన జీతాన్ని పూర్తిగా ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత పొదుపు చేయండని.. పెద్దవాళ్లు చెపితే.. ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరింది.. అప్పుడే సేవింగ్స్ ఏమిటీ.. ఇంకా చాల టైముంది అని కొట్టిపారేసే యూత్ సంఖ్య నూటికి  90 శాతం  ఉంటుంది.. ఇబ్బందులెదురైతే తప్ప సేవింగ్స్ ఇంపార్టెన్స్ తెలిసిరాదు..  అనుకోని పరిణామాలెదురైతే..మళ్లీ ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే .. సంపాదిస్తున్నప్పుడే సేవింగ్ చేయాలి..అదీ ఉద్యోగం వచ్చిన కొత్తలో చేస్తే భవిష్యత్తుకు భరొసా ఉంటుంది.

చిన్న వయసు నుంచే పొదుపు మొదలు పెడితే ..లాభాలు బోలేడంటున్నారు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు.. అయితే సేవింగ్స్ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఓ ప్లాన్ ఉండాలి.. మొదటగా ముందున్నలక్ష్యాలు.. బాధ్యతలేమిటో తెలుసుకోవాలి. వచ్చేజీతంలో పోదుపు కోసం ఎంత కేటాయించాలి.. బాధ్యతల కోసం ఎంత కేటాయించాలనేది నిర్ణయించుకోవాలి.. వీటితో పాటు రోజు వారి ఖర్చుల కోసం.. వీకెండ్ పార్టీల కోసం కూడా కొంత మొత్తాన్ని ఉంచుకోవాలి.. అయితే ఖర్చులు ..జల్సాల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముందుగా కేటాయించుకున్న మొత్తంలోనే ఖర్చు చేయాలి తప్ప పోదుపును వాయిదా వేసి ఆ మొత్తాన్ని జల్సాల కోసం ఖర్చు చేయకూడదు.

పొదుపులో అతి ముఖ్యమైంది.. జీవిత బీమా.. ఉద్యోగంలో చేరగానే.. మీరు మొదటగా టార్గెట్ అయ్యిది ఇన్సూరెన్స్ ఏజెంట్ల చేతిలోనే.. వారు చెప్పే మాటల వల్ల వెనకా ముందు ఆలోచించకుండా భారీ ప్రీమయం ఉండే బీమా పాలసీలను తీసుకుంటారు…అయితే ఇది ఎంత మాత్రం తెలివైన పని కాదు..లో ప్రీమియం ..హై రిస్క్ ఉండే టర్మ్ పాలసీలే ఎప్పటికీ బెటర్..జీవిత బీమా పాలసీ చేసేటప్పుడు.. పాలసీ టర్మ్ అయిపోయాక వచ్చే మొత్తాని కంటే .. పాలసీ మద్యలో అనుకోనిదేమైనా జరిగితే.. మీపై ఆధార పడ్డ వారికి ఆర్ధికంగా అండగా ఉండేందు ఎంత ఎక్కువ మొత్తం వస్తుందనే విషయానికి  ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత బీమాతో పాటు ఆర్యోగ్య బీమా చేయడం కూడా ముఖ్యమే.. మీరు ఉద్యోగంలో చేరిన కంపెనీలో ఆరోగ్య బీమా ను ఆఫర్ చేస్తున్నప్పటికీ సొంతంగా ఓ పాలసీ తీసుకోవడం ఎప్పటికీ మంచిదే.. వీటితో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా.. డిజెబిలిటీ బీమా తీసుకోవాలి..వీటి ప్రీమియంలు చాల తక్కువగా ఉంటాయి.. అనుకోకుండా ఎమైనా జరిగితే హస్పిటల్స్ కు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ప్రీమియం రూపంలో చెల్లించేది చాలా తక్కువగా ఉంటుది. కావున ఈ బీమా పాలసీలు తీసుకోవడం చాల ముఖ్యం

కొత్తగా ఉద్యోగంలో చేరే వారిలో ఎక్కవ మందికి జాబ్ గ్యారంటీపై కన్ ఫ్యూజన్ ఉంటుంది.. పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా ..ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం.. ఉద్యోగంలో భాగంగా అప్పజెప్పిన పనిని గడువులోగా చేయలేకపోతుంటే.. ఈ ఉద్యోగం చేయలేమోనన్న భావన మొదలవుతుంది..ఇలాంటి పరిస్ధితుల్లోమరో కంపెనీకి మారాలా.. లేక అదే ఉద్యోగంలో కొనసాగాలా అనే అయోమయం ఉంటుంది. ఉద్యోగం తప్పకుండా మారాల్సిన పరిస్థితి వస్తే.. ఒకటి రెండు నెలలు నచ్చిన ఉద్యోగం వచ్చే దాకా వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చుల కోసం మరోకరిపై ఆధారపడక తప్పదు..దీంతో పాటు మొదటి సారిగా ఉద్యోగంలో చేరిన వెంటనే చేసిన బీమా పాలసీలు..లేదా సేవింగ్స్ స్కీమ్స్ ఇన్ స్టాల్ మెంట్  చెల్లించడంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఉద్యోగం చేరిన వెంటనే.. ఆరు నెలల ఖర్చులకు సరిపడా ఓ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలి..ఇందుకోసం జీతంలో 25 శాతం మొత్తాన్ని కేటాయించాలి.

మొదటి సారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు వయసు తక్కువగా ఉంటుంది.. ఆ ఏజ్ ని బట్టి అవసరాలు ..లక్ష్యాలు షార్ట్ టర్మగా ఉంటాయి. ఉన్నత విద్య కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు..బైక్ లేదా కారు కొనుక్కోవడం.. తోబుట్టువుల కోసం ఏదైన కొనడం ఇలాంటి షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని నెరవేర్చుకునేందుకు బ్యాంక్ ఫిక్సడ్ డిపాజిట్లును ఎంచుకోవడం బెటర్.. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 6 నుంచి 9 శాతం ఇంట్రెస్ట్ చేల్లిస్తున్నాయి..మరో విషయం ఏమిటంటే అత్యవసరమైతే ఈ ఎఫ్ డీల నుంచి డబ్బును వెంటనే తీసేసుకునే వీలుంటుంది.

ఎక్కువ జీతం ఉండి.. 20 శాతం ఆదాయం పన్ను శ్లాబులో ఉన్న వారు మాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మేలు.. వీటి మీద కూడ 6 నుంచి 9 శాతం వార్షిక రాబడి ఉంటుంది. అయితే కనీసం రెండేళ్ల వ్యవధికి సేవింగ్ చేయగలిగితేనే ఈ ఫండ్స్ ను ఎంచుకోవాలి.  అత్యవసరమైతే.. ఈ ఫండ్స్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మును తీసుకోవచ్చు.. అయితే సంత్సరంలోపు సొమ్మును వెనక్కి తీసుకుంటే అర శాతం నుంచి ఒక శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది.

జాబ్ లో చేరగానే ఓన్ హౌజ్ సొంతం చేసుకోవాలనే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది.  బ్యాంకులు కూడా హౌసింగ్ లోన్స్ ఈజీగానే ఇస్తున్నాయి. అయితే ప్రపార్టీ విలువలో కనీసం 20 నుంచి 30 శాతం వరకు మార్జిన్ మనీ చెల్లించాల్సి ఉంటుంది..దీన్ని సమకూర్చుకోవాలంటే షార్ట్ టర్మ్ కు ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. పెళ్లికి ముందే సొంతిళ్లు సమకూర్చుకుంటే ఆదాయం పన్ను గరిష్టి స్థాయిలో మినహాయింపు పొందడమేకాక  పెళ్లి తరువాత వచ్చే ఖర్చులను ఈజీగా అధిగమించవచ్చు..

ఉద్యోగంలో చేరిన కొత్తలో గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఉద్యోగం చేరిన రోజు రిటైర్ మెంట్ తరువాత ఉండే ఖర్చులను తట్టుకునేందుకు ఏలా ప్లాన్ చేసుకోవాలనేది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు..లైఫ్ స్పాన్ బాగా పెరిగాయి.  రిటైర్మెంట్ తరువాత కూడా కనీసం 25 నుంచి 30 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు.. ఆర్దిక అవసరాలు తట్టుకునేందుకు మరోకరికి భారం కాకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి..ఈ అవసరాల కోసం లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచింది. డిసిప్లేన్ గా  నెలకు కనీసం రెండు వేల రూపాయలు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి.. ప్రస్తుతం ఈ ఫండ్స్ ఇస్తున్న రిటర్స్ ప్రకారం నెలకు 5 వేల రూపాయలను పెట్టుబడిగా పెడితే  25 ఏళ్లు సుమారు 70 లక్షలు.. 30 ఏళ్లకు కోటీ 20 లక్షలు.. అదే 35 ఏళ్లకయితే సుమారు రెండు కోట్లు రూపాయలు చేతికందుతుంది. అంటే ఇప్పుడు చిన్న మొత్తాలుగా చేసే సేవింగ్స్ రిటైర్మెంట్ నాటికి మిమ్ముల్ని కోటీశ్వరులను చేస్తుంది.

పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి..అవేంటంటే.. మొదటది అర్ధంకాని స్కీమ్స్ జోలికి వెళ్లకూడదు… రెండోది..ఉద్యోగం చేరిన కొత్తలోనే పక్కవారిని చూసి టెమ్ట్ అయిపోయి షేర్లలో డే ట్రేడింగ్ చేయకూడదు. మూడోది ..ఒక వేళ క్రెడిట్ కార్డు తీసుకుంటే ఖర్చుల కోసం కార్డును వాడటంలో నియంత్రణ ఉండాలి. నాలుగోది.. ఫైనాన్షియల్ ప్లానింగ్ పై ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. చివరిది ముఖ్యమైనది మీరు చేసే సేవింగ్స్ లో కనీసం 30 శాతానికిపై గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి.. ఫీ ఎఫ్ సొమ్మును తప్పని సరైతే తప్ప అదీ లాస్ట ఆప్షన్ గానే వాడుకోవాలి.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy