ఆన్ లైన్ లోనూ రిలీజవుతున్న ‘సింగం123‘

Singam-123-Movie-Review-Ratingహీరో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న మూమీ సింగం 123. హృదయ కాలేయం ఫేం సంపూర్ణేశ్ బాబు ఈ మూవీలో హీరో గా నటించాడు. అయితే.. ఈ మూవీ పై భారీగానే అంచనాలున్నాయి. సంపూర్ణేశ్ పేరడీ సన్నివేశాలు, డైలాగులతో ఇప్పటికే వచ్చన ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ శుక్రవారం (జూన్ 5) న రిలీజ్ కాబోతోంది. కాకపోతే ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే కాకుండా ఆన్ లైన్ లోనూ రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. ఆన్ లైన్లో డబ్బులు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. అయితే.. ఇండియాలో కాకుండా వేరే దేశాల్లోని వారికి మాత్రమే ఆన్ లైన్లో చూసే అవకాశం ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy