సంస్కృతికి, ఉద్యమానికి తెలంగాణ నేల ప్రాణప్రదం: వెంకయ్య

KCR-VENKYకేసీఆర్ మాటలు, తెలుగు పద్యాలు వింటుంటే షడ్రషోపేతమైన భోజనం చేసినట్టుందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భాషలో మాధుర్యం అలాంటిదన్నారు. రాజ్ భవన్ లో పౌరసన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ… పద్యం, గద్యం వినే అవకాశం తగ్గిపోతున్న రోజులివి. ఈ సన్మాన కార్యక్రమం సాహిత్యబద్ధంగా , సాస్కృతికంగా, సంప్రదాయబద్ధంగా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ నేల పోరు నేల అంటూ కొమురం భీం, సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ లాంటి మహనీయులు గుర్తు చేసుకున్నారు. అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించే వాడే నాకు ఆరాధ్యుడని కాళోజీ అన్న మాటలను గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి విశిష్టమైనదన్న ఆయన.. బోనాలు, బతుకమ్మ, రంజాన్ లాంటి పండగలు చేసుకుంటారని తెలిపారు. తెలంగాణ రుచులు బిర్యానీ, హలీమ్ తెలియనివారుండరన్నారు. రాజకీయంగా తాను ఎదిగింది ఇక్కడే అన్నారు. సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో తాను పర్యటించని మండలం, తాలూకా లేదన్నారు. ఇక్కడి ప్రజలు భిన్న మతాలు, సంస్కృతుల కలయికగా చెప్పారు. అలయ్ – బలయ్ తో దానికి దత్తన్న మరింత ప్రాచూర్యం కల్పించారన్నారు.

తెలంగాణ అంటే.. దక్షిణాది వారికి ఉత్తరాదని.. ఉత్తరాది వారికి దక్షిణాదన్నారు. మినీ భారత్ అన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ పటంలో నిలిపేందుకు అనేకమంది కారణమవ్వొచ్చు. కానీ దానికున్న ప్రత్యేకత దానికుంది.

రాష్ట్ర విడిపోయింది ఒకరికి వ్యతిరేకం కాదు. ప్రజలు ఉద్యమించారు.. తమ ఆశలను, తమ న్యాయబద్ధమైన వాటాలను సాధించారన్నారు. కలిసి కలహించుకునే దానికన్నా.. విడిపోయి అభివృద్ధి చేసుకోవడం కరెక్ట్ కదా అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు .. కలిసి చర్చించుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఇంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి.. వాటిని కూర్చుని మాట్లాడుకుని.. కలిసి పనిచేయాలి. రెండు రాష్ట్రాల సీఎంలు  తమ అనుభవంతో అభివృద్ధి చేయాలి.

ఈ సందర్భంగా సినారెను గుర్తు చేసుకున్నారు వెంకయ్య. సాహిత్యప్రపంచంలో రారాజు… సినారె. శ్రీనాథుడలాంటి వారు. ఆయన తెలుగుభాషకు పట్టం కట్టారన్నారు. ఆయన వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు.

సంగీతం సాహిత్యం జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడే విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు, కేసీఆర్.. కలిసి పనిచేయండి.. మాట్లాడుకోండి.. తెలుగు భాషను బతికించండి.. అన్నారు. నేను ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదు.. భాష, భావం కలిసి ఉండాలి.. మన సంస్కృతి భాష ద్వారా తెలుస్తుంది. కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషను మర్చిపోవద్దన్నారు. క్రమేపీ భాష కనుమరుగవుతుంది. కాపాడుకోవాలన్నారు. ఉద్యోగం రావాలంటే తెలుగువచ్చి ఉండాలి. అప్పుడే తెలుగు బతుకుతుంది. రాజులు పాత రోజుల్లో సంగీతం, సాహిత్యాలను ప్రోత్సహించేవారు.. శ్రీకృష్ణదేవరాయలే దానికి ఉదాహరణ. సురవరం, మాడపాటి నైజాంలో భాషను బతికించుకునే పని చేశారు.

హైదరాబాద్ నుంచే నా అధికారిక పర్యటన మొదలవ్వాలని కోరుకున్నాను. సీఎం కేసీఆర్ తో అదే చెప్పాను. గొప్ప సన్మానం జరిపినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

“పదవి చాలా పెద్దది… దానికుండే పరిమితులు కూడా దానికి ఉంటాయి.. ప్రేమతో ఆదరంతో కలవనప్పుడు.. అదేం పద్ధతి” అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఆత్మావలోకనం చేసుకోవాలి. స్వరాజ్యం వస్తే సమస్యలు పోతాయని భావించారు. స్వరాజ్యం వచ్చింది కానీ.. సురాజ్యం చేసుకోవాలి.. రామరాజ్యం చేసుకోవాలి..  ప్రజాప్రతినిధులు పని చేయాలి.. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy