సక్సెస్ ఫుల్ గా టీ – హబ్ రెండేళ్ల ప్రయాణం

T-Hub‘ఐడియాతో వచ్చి ప్రాజెక్టుతో వెళ్లండి’ అనే నినాదంతో రెండేళ్లకిందట టీ – హబ్ ప్రారంభమైంది. రెండేళ్ల కిందట గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో టీ-హబ్  ఏర్పాటు అయ్యింది. నవంబర్ 5న గవర్నర్ నరసింహన్, పారిశ్రామిక దిగ్గజం.. టాటా కంపెనీల అధినేత రతన్ టాటా ప్రారంభించారు. ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభమైన టీ – హబ్ రెండేళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. దేశంలోనే బెస్ట్ అండ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది టీ – హబ్. స్టార్టప్ కు సత్యనాదెళ్ల, విశాల్ సిక్కా, రెహమాన్ లాంటి దిగ్గజాలు సూచనలు చేశారు. టీహబ్ నుంచి వచ్చే స్టార్టప్స్ కు దేశవిదేశాల్లో గుర్తింపు లభిస్తోంది. ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, నల్సార్ లా యూనివర్సిటీలతో టై అప్ అయ్యింది.  చాలా ఔత్సాహికులు టీ-హబ్ తో కలిసి ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతున్నారు. టీ హబ్ ఏడాది ప్రయాణంపై ప్రత్యేక కథనం… వీడియో చూడండి..

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy