సగం జనాభాకు టాయిలెట్స్ లేవు

toiletఇండియాలోబహిరంగ మల విసర్జనపై అంతర్జాతీయ సంస్థ ‘వాటర్ ఎయిడ్’ విడుదల చేసిన రిపోర్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఇప్పటికీ 56 శాతం మందికి సరైన పారిశుధ్య వసతులు లేవని ఆ నివేదికలో తెలిపింది. భారత్‌లో ఇప్పటికీ 355 మిలియన్ల మంది మహిళలు, అమ్మాయిలకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రకటించింది. ‘ఔట్ ఆఫ్ ఆర్డర్ ది స్టేస్ ఆఫ్ ది వరల్డ్ టాయిలెట్స్-2017’ ఆ సంస్థ ఇటీవల ఓ నివేదిక బయటపెట్టింది. 2000 నుంచి 2015 మధ్య కాలానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక తయారు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే.. కనీస పరిశోధన కూడా చేయకుండా పొంతనలేని వివరాలతో రిపోర్టు విడుదల చేశారని దీనిపై పలువురు మండిపడుతున్నారు.

నివేదికలోని చాలా అంశాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఇదే నివేదికలో 2017 జూన్ వరకు 350 మంది బహిరంగంగా మల విసర్జన చేస్తున్నారని తెలిపారు. 2017 నవంబర్ వరకు ఈ సంఖ్యను 300 మిలియన్లకు తగ్గించినట్లు తెలిపింది. 300 మిలియన్లు తగ్గించారని చెబుతూనే.. ఇప్పటికీ 355 మిలియన్ల మంది టాయిలెట్లు వాడటం లేదని చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం ఫలితంగా.. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. 2019 వరకు దేశాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించానికి మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి.

టాయిలెట్‌ పేరును ‘గౌరవ గృహం’గా మార్చి, ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడాలంటూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి సమయంలో ‘వాటర్ ఎయిడ్’ ఇచ్చిన నివేదిక పూర్తి అసంబద్ధంగా ఉందంటూ ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తన్నారు. భారత్‌లో కేంద్ర నీటి వనరులు, పారిశుధ్య శాఖతో కలిసి పని చేస్తూనే ఆ సంస్థ.. సరైన వివరాలు సేకరించకుండా ఇలాంటి పసలేని నివేదికను ఇవ్వడం బాధాకరమంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy