సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్.. మే 26న విడుదల

downloadమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోగ్రఫీతో తెరకెక్కుతున్న చిత్రం.. 200 నాట్ అవుట్.. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్.  ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది. సూపరంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇండయన్ క్రికెటర్స్ పై వచ్చిన విమర్శలకు సమాధానమే సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ అంటున్నారు సచిన్ అభిమానులు.

కోట్లాది మంది భారతీయుల ఆశాకిరణం, టీంఇండియాపై అభిమానులు పెట్టుకున్న బిగ్ డ్రీమ్స్ ని సచిన్ ఎలా నిజం చేశాడో తెలుసుకోవడానికి ఈ ట్రయిలర్ ఓ మచ్చుతునక. అవరోధాలు ఎన్ని ఎదురైనా.. గెలుపే లక్ష్యంగా.. బ్యాటే ఆయుధంగా యుద్ద భూమి (క్రికెట్ గ్రౌండ్) లోకి అడుగుపెట్టే క్షణాలను సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ ట్రయిలర్ అద్భుతంగా తెరకెక్కించారు.

కార్నివాల్ మోషన్ పిక్చర్, రవి భగ్ చంద్ కా నిర్మాతలుగా జేమ్స్ ఎరిస్కిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy