సచిన్ గానా – భజానా

sachin-sonuక్రికెట్‌ లెజండ్ సచిన్‌ టెండుల్కర్… సింగర్ అవతారమెత్తారు. ఓ ఆల్బమ్ లో పాట పాడారు సచిన్. బర్త్ డే ముందు అభిమానులకు పాట రూపంలో విందు ఇచ్చారు. సింగర్ సోను నిగమ్‌తో కలిసి ‘క్రికెట్‌ వాలే బీట్‌’ పేరుతో ఒక ఆల్బమ్‌ కూడా విడుదల చేశారు మాస్టర్. ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సచిన్‌ తన తొలి మ్యూజిక్‌ ఆల్బమ్‌ను పరిచయం చేశారు. ఆ ఆల్బమ్‌లో సచిన్‌ అక్కడక్కడా కొన్ని పదాల వరకే పాడారు. మరోవైపు సచిన్‌ కెరీర్‌లోని ప్రధాన ఘట్టం 2011 ప్రపంచకప్‌ విజయాన్ని ఆధారంగా చేసుకుని ‘లిటిల్‌ మాస్టర్‌’ అనే డాక్యుమెంటరీ తయారైంది. దీన్ని ఏప్రిల్‌ 23న ఈఎస్‌పీఎన్‌ ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు. గౌతమ్‌ చోప్రా ఈ డాక్యుమెంటరీని రూపొందించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy