సచిన్ రాంగ్ షాట్..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్,పారుపల్లి కశ్యప్ ల వివాహం నిన్న(శుక్రవారం) జరగ్గా వారిని విష్ చేస్తూ సచిన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. అయితే సచిన్.. ట్వీట్ తో పాటు సైనా,కశ్యప్ కలిసి ఉన్న ఫొటో కాకుండా.. సైనా మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తో  ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు సైటెర్లు వేస్తూ రిప్లైలు కూడా ఇచ్చారు. క్రికెట్ ప్లేయర్స్,సినీ సెలబ్రెటీలు తప్ప సచిన్ వేరే వాళ్లను గుర్తు పట్టరంటూ కామెంట్స్ చేశారు. దీంతో తప్పును గ్రహించిన సచిన్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి.. సైనా,కశ్యప్ మ్యారేజ్ సందర్భంగా తీసుకున్న ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy