సచిన్ రాసినవన్నీ అబద్దాలే: గ్రెగ్ చాపెల్

sachin-tendulkar10_082611010648సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అన్నీ అబద్దాలే రాశాడని ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. ద్రావిడ్ ను కెప్టెన్సీ నుండి తప్పించడానికి ఎప్పుడూ ట్రై చేయలేదని…అలాగే సచిన్ ను కెప్టెన్‌ గా ఉండమని కూడా అడగలేదని అన్నాడు. ఇండియన్ టీమ్ లో గొడవలు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, సచిన్ రాతలు తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని చాపెల్ అన్నాడు. అప్పట్లో సచిన్ ఇంటికి తను ఒక్కసారే వెళ్ళానని, తన వెంట ఫిజియో, అసిస్టెంట్ కోచ్ కూడా ఉన్నారని చాపెల్ అన్నాడు. సచిన్ ను కెప్టెన్ చేయాలని ప్రయత్నం చేయలేదని చాపెల్ చాలా గట్టిగా చెప్పాడు.

సచిన్ ఏం రాశాడంటే….

సచిన్ టెండూల్కర్ ఆత్మకథలో ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై చాలా ఆరోపణలు చేశాడు సచిన్. ‘2007 లో  వాల్డ్ కప్ కు ముందు మా ఇంటికి వచ్చిన చాపెల్ అప్పుడు కెప్టెన్‌ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ను తీసేసి, నన్ను కెప్టెన్‌ గా ఉండమన్నాడు. నన్ను కెప్టెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తానన్నాడు చాపెల్. అలా చేస్తే ఇద్దరం కలిసి రాబోయే రోజుల్లో ఇండియా క్రికెట్‌ను శాసించవచ్చని అన్నాడు.’ అని ఈ బుక్ లో రాశాడు సచిన్. ‘దీనికి నేను ఒప్పుకోలేదు. అదొక్కటే కాదు,  ఒక దశలో లక్ష్మణ్, గంగూలీ సహా టీమిండియాలోని సీనియర్ ప్లేయర్లందరినీ తీసేయాలనుకున్నాడు.’ అని కూడా బుక్ లో రాశాడు సచిన్. వాల్డ్ కప్ కు ఇండియన్ టీమ్ తోపాటు చాపెల్‌ను పంపవద్దని బీసీసీఐకి చెప్పానని కూడా సచిన్ రాసుకొచ్చాడు.

‘చాపెల్ గురించి సచిన్ తన బుక్ లో అన్నీ నిజాలే చెప్పాడు’ అని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. మరో సీనియర్ క్రికెటర్ కీర్తి అజాద్ కూడా సచిన్ చెప్పింది నిజమేనన్నాడు కానీ, అప్పట్లోనే ఈ విషయం చెప్పి ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy