సచిన్ సినిమాకు పన్ను మినహాయింపు

346838-sachin-tendulkar-smileసచిన్ టెండుల్కర్ బయోపిక్‌ ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’కు కేరళ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు పన్ను మినహాయింపు నిచ్చాయి. ఆయా ప్రభుత్వాల పాలసీ ప్రకారం ట్యాక్స్‌ ఫ్రీ నిర్ణయం తీసుకున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆ సినిమా నిర్మాత రవి భాగ్‌చందక్‌ హర్షం వ్యక్తం చేశారు. సచిన్‌ కథ.. నేటి తరం యువతకు సందేశాత్మకంగా నిలుస్తుందన్నారు రవి. కేరళ, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్యాక్స్‌ ఫ్రీ చేయడం వల్ల ఎంతో మంది ఈ బయోపిక్‌ను చూసే అవకాశం కలుగుతుందన్నారు. తన జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను సచిన్‌ ఎలా అధిగమించాడో చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుందన్నారు రవి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy