సత్యంబాబుకు డిగ్రీ.. జైల్లోనే ఉన్నత చదువులు

Satyam babuవిజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషామీరా కేసులో నిర్దోషిగా బయటపడ్డ సత్యంబాబు.. డిగ్రీ పట్టా అందుకున్నాడు. హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా..  నగరానికి వచ్చిన ఆయన.. ఏమీ చేయకపోయినా.. ఆయేషా కేసులో 9ఏళ్లు జైలు జీవితం గడిపానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో జైల్లో ఉంటూనే అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ ప్రారంభించాడు.

సోమవారం సాయంత్రం ప్రెస్ క్లబ్ లో మాలల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సత్యంబాబు… తల్లిదండ్రులు తనను కాపాడుకోవడానికి..  ఆర్థికంగా చితికిపోయారని బాధపడ్డాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు.. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరాడు. తాను విడుదల కావడానికి అయేషా తల్లిదండ్రులే సహకరించారని చెప్పాడు సత్యంబాబు. వాళ్లకు ఋణపడి ఉంటానన్నాడు. అయేషా కేసులో తప్పు చేసిన వాళ్లను పట్టుకొని శిక్షించి.. వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

అయేషా కేసులో.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన చెందాడు. తల్లి, చెల్లిని చంపుతామని బెదిరించడంతో తానే చేసినట్టు ఒప్పుకున్నానన్నాడు. లేకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారన్నాడు సత్యంబాబు.

తొమ్మిదేళ్లు జైలులో ఉండడంతో తన కుటుంబం ఆగమైందన్నాడు. ప్రభుత్వం కనుకరించి తనకు ఇళ్లు, జాగ, ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాడు. నిరక్షరాస్యుడిగా జైలుకు వెళ్లిన సత్యంబాబు మే 1న ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy