సన్ రైజర్స్.. మళ్లీ మెరిసింది

sunrisers-1462452758-800వరుస ఓటముల తర్వాత మళ్లీ విజయాల బాటపట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించింది. 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. డేవిడ్ వార్నర్ (70 నాటౌట్) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో మనన్ వోహ్రా (95) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో దాదాపు మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ.. బౌలర్ భువనేశ్వర్ కుమార్ (5/19) 19వ ఓవర్‌లో వోహ్రాతో పాటు కరియప్ప వికెట్ తీసి సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆఖరికి పంజాబ్ 19.4 ఓవర్లలోనే 154 పరుగులకు ఆలౌటైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy