సపారీల చేతుల్లోకి టీ20 సిరీస్

India-South-Africa-Cr_Verm02కటక్ టీ20ని సౌతాఫ్రికాకు సమర్పించుకుంది టీమిండియా. దాంతో పాటు సిరీస్ ను కూడా. ధర్మశాలలో పోరాడి ఓడిన ధోనీ గ్యాంగ్… కటక్ లో మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. సఫారీ డామినేషన్ ముందు నిలవలేకపోయింది. మ్యాచ్ తో పాటు పరువునూ పోగొట్టుకుంది టీమిండియా.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా… మొదట్లోనే తడబడింది. నాలుగో ఓవర్లోనే క్రిస్ మోరిస్…. శిఖర్ ధావన్ ని ఔట్ చేసి తొలిదెబ్బ కొట్టాడు. తర్వాత కోహ్లీ, రోహిత్ వెంటవెంటనే రనౌట్ అవడంతో మ్యాచ్ సఫారీల చేతుల్లోకెళ్లిపోయింది. రైనా కాసేపు పోరాడినా నో యూజ్. టీమిండియా బ్యాట్స్ మెన్ లో రోహిత్, రైనా, ధవన్, అశ్విన్ మాత్రమే డబుల్ డిజిట్ నమోదు చేశారు. బ్యాట్స్ మెన్ పూర్ పర్ ఫామెన్స్ తో 17.2 ఓవర్లలో 92 రన్స్ కే ఆలౌట్ అయింది భారత్. ఆల్బీ మోర్కెల్ మూడు… మోరిస్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇదే కొంప ముంచింది

ఇదే కొంప ముంచింది

93 రన్స్ ఈజీ టార్గెట్ తో బరిలో దిగిన సఫారీ టీం… 13 రన్స్ కే ఆమ్లా వికెట్ కోల్పోయింది. తర్వాత డూప్లెసిస్, డివిలీర్స్ కూడా వెంట వెంటనే ఔటవడంతో 49 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయింది. మూడు వికెట్లూ అశ్విన్ కే పడ్డాయి. తర్వాత డుమినీ, బెహార్డిన్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిలబెట్టారు. 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 రన్స్ చేసింది సఫారీ టీం. అప్పటికే విజయానికి చేరువైంది. అయితే డ్రింక్స్ బ్రేక్ లో అభిమానులు స్టేడియంలోకి బాటిల్స్ విసరడంతో 19 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఇక 13 ఓవర్లప్పుడు మరోసారి ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో మరోసారి ఆపేశారు.

అప్పటికే డక్ వర్త్ లూయిస్ సిస్టంలో సఫారీల విక్టరీ కన్ ఫామ్ అయింది. అయితే పోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయడంతో మ్యాచ్ పూర్తయ్యే వరకు కొనసాగించారు. 17.1 ఓవర్లలో డుప్లెసిస్ గ్యాంగ్ టార్గెట్ ను ఫినిష్ చేసింది. డుమినీ 30, డివిలీర్స్ 19, డుప్లెసిస్ 16 రన్స్ చేశారు. మూడు వికెట్లు తీసి సఫారీల విక్టరీలో కీ రోల్ ప్లే చేసిన మోర్కెల్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. కటక్ లో అభిమానుల మిస్ బిహేవియర్ పై క్రికెటర్స్ ని అసహనానికి గురిచేసింది. గవాస్కర్, లక్ష్మణ్ అభిమానుల తీరుపై సీరియస్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ తో బారాబతి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని నిర్వహించే అర్హత కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇక సిరీస్ లో లాస్ట్ టీ 20 గురువారం కోల్ కతాలో జరగనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy