సభకు రండి..లేదంటే రాజీనామా చేయండి

sachinప్రముఖ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ నటి రేఖకు షాకిచ్చారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్. వారిద్దరూ రాజ్యసభకు హాజరు కావాలని లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా రాజ్యసభ సమావేశాలకు హాజరుకాకపోవడంపై అగర్వాల్‌ సభలో ప్రస్తావించారు. రాజ్యసభ సమావేశాలు ముగుస్తున్నాయని… సభ్యులెవరూ ఇంతరవకు సభలో వీరిని చూడలేదన్నారు. వారికి సభకు రావాలనే ఆసక్తి లేదన్నారు. ఎంపీ పదవులపై ఆసక్తి లేకుంటే రాజీనామా చేయడం ఉత్తమమన్నారు.  కొద్ది రోజులుగా సచిన్‌, రేఖ రాజ్యసభకు హాజరవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సచిన్‌, రేఖతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనభర్చిన 12 మంది రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. వీరిలో బాక్సర్‌ మేరికోమ్‌, జర్నలిస్టు స్వప్నదాస్‌ గుప్తా, వ్యాపారవేత్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy