సభలో కన్నతల్లి – మంత్రసాని పాత్రలు

JANAఅసెంబ్లీలో కన్నతల్లి – మంత్రసాని పాత్రలపై కొద్దిసేపు ఆసక్తికర, హాట్ డిస్కషన్ జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ అధికార పార్టీది కన్నతల్లి పాత్ర అయితే.. విపక్షాలది మంత్రసాని పాత్ర అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై జానా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నారో చూద్దాం…

 

 

రసమయి :

రైతులపై మాకు ప్రేమ లేదా.. మాకూ కడుపు నొప్పి ఉంటుంది. రైతు ఆత్మహత్యలపై ఆందోళన చెందుతున్నాం. మాది కన్నతల్లి ప్రేమ అయితే.. మీది మంత్రసాని పాత్ర అన్నారు. రైతులపై ఎక్కువ ప్రేమ మాకే ఉందన్నారు. 15 నెలలు నిండని పసిగుడ్డును.. చంకన ఎత్తుకున్నాం. 60 సంవత్సరాల తన్నులాట మోస్తూ.. దోపిడీకి ఎదురీదుతూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామన్నారు.

జానారెడ్డి :

రసమయి వ్యాఖ్యలపై అగ్గిపై గుగ్గిలం అయ్యారు కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి. ఇంతకీ ఇతనిది ఏ పాత్ర అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కన్నతల్లి – కాంగ్రెస్ మంత్రసాని పాత్రా..? అర్థం పర్థం లేనటువంటి.. అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 60 ఏళ్లు దేశానికే దిశానిర్దేశం చేశాం.. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ ది మంత్రసాని పాత్రా..? మేం కన్నతల్లిగా ఉండి.. నువ్వు మంత్రసానిగా పడిగాపులు కాస్తే.. నేను కన్నతల్లిగా పాత్ర నిర్వహించి.. తెలంగాణ బిడ్డను ఇచ్చాను. రసమయి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy